అమ్మవారి విగ్రహం దొంగిలింపు! ప్రభుత్వం అటవీ శాఖ అధికారులదే బాధ్యత తాండ్ర రవీందర్
తాటికుంట మైసమ్మ అమ్మవారి విగ్రహం దొంగిలింపు ప్రభుత్వం అధికారులు, అటవీ అధికారుల దే బాధ్యత అని బిజెపి యాచారం మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం లో చాలా సార్లు హుండీ డబ్బులు దొంగిలించిన పట్టించుకోని అధికారులు, అసలు ఎవరి అసమర్ధత? లేక ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవరించడం వెనుక ఇంకా ఏమైనా మతలబు ఉందా? ఖచ్చితంగా పోలీస్ వారు, ఫారెస్ట్ అధికారులు రేపటి లోగ విగ్రహం దొంగలను పట్టుకొని విగ్రహం తేకపోత, భారతీయ జనతా పార్టీ యాచారం మండల శాఖ తరుపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, హిందూ దేవతలు విగ్రహాలు పోతు ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వం పని, ఎందుకంటే ఇక్కడ ఫార్మాసిటీ ఎలాంటి అడ్డంకి ఉండకూడదని, ఈ విదంగా చేస్తుంది అని దాదాపు అర్థం అవుతుంది, రేపటి లోగ విగ్రహం తో పాటు దొంగలను పట్టుకొని జైలుకు పంపాలని లేని పక్షం లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం