Wednesday, 4 November 2026

అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలలో పాల్గొన్న

 :ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి  ముద్దగౌని రామ్మోహన్ గౌడ్
ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) బోనాల పండుగ సందర్బంగా ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి  ముద్దగౌని రామ్మోహన్ గౌడ్  కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ లోని శ్రీ చిత్తారమ్మ అమ్మవారి దేవాలయం, కొత్తపేట శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం, సత్యా నగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం, చైతన్యపురి డివిజన్ మారుతి నగర్ కాలనిలోని  శ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీ విజయదుర్గా దేవాలయం, వనస్థలిపురం డివిజన్ హస్తినాపురం ఈస్ట్ కాలనీలోని  శ్రీ దుర్గా పోచమ్మ అమ్మవారి దేవాలయంలలో అమ్మవార్లను దర్శించుకుని  ప్రత్యేక పూజా కార్యక్రమంలలో పాల్గొన్నారు. అనంతరం హస్తినాపురం ఈస్ట్ కాలనీలోని  శ్రీ దుర్గా పోచమ్మ అమ్మవారి  దేవాలయం వద్ద తెరాస పార్టీ యువ నాయకులు శ్రీ షేర్ రామన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు . ఆయా దేవాలయంలలో ఆలయ కమిటీల ప్రతినిథులు, కాలనీవాసులు కొత్తపేట మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ ,   కొత్తపేట లయన్స్ క్ల బ్ అధ్యక్షుడు బి విజయరంగ   , మేకల సత్యనారాయణ , గణేష్, వంజరి ప్రవీణ్ కుమార్, ప్రణయ్ కుమార్ , సత్య ప్రసాద్ , తులసి గౌడ్, షేర్ రామన్, భూపతి రెడ్డి , త్రివేది , విజయ రంగ , రాజశేఖర్ గౌడ్ , తిరుమల రెడ్డి ,  శ్రీకాంత్ ,నాగు,రాజేందర్ , గట్టు శ్రీనివాస్, నిఖిల్  తదితరులున్నారు .