జేఎన్‌టీయూ : పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విద్యార్థులు సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ పర్యావరణ పరిరక్షణ ఫోరం ఆధ్వర్యంలో కూకట్‌పల్లి జేఎన్‌టీయూలోని జేఎన్ ఆడిటోరియంలో పర్యావరణ పరిరక్షణకు విద్యార్థి మహాసభను బుధవారం నిర్వహించారు. ఈ సదస్సుకు స్వామిగౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘అమ్మాయిలూ.. మీ పుట్టిన రోజున మీ ఇంట్లో ఓ మామిడి మొక్కను నాటండి.. మీరు అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చే సరికి అది కాయలు ఇస్తుందని’ సూచించారు. తెలంగాణ పర్యావరణ పరిరక్షణ ఫోరం అధ్యక్షుడు ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ అడవులు నాశనం కావడం వల్ల కులవృత్తుల వారు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లో పంటలు సరిగా పండక అణగారిన వర్గాల రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మల్లేశం, టీయూడబ్ల్యూజే నాయకుడు పల్లె రవికుమార్, జేఎన్‌టీయూ అకడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ ఎ.దామోదరం, డాక్టర్ ఎంవీఎస్‌ఎస్ గిరిధర్, తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బి.అశోక్‌గౌడ్, ఎ.వినయ్‌బాబు, మాధవరెడ్డి, రమణా నాయక్, శివనేత, విజయ్‌కుమార్, కిరణ్, శ్రవణ్, వెంకటేశ్ యాదవ్, శ్యాం, మెరుగు మహేష్, స్నేహ, సురేష్ నాయక్ పాల్గొన్నారు.




