Wednesday, 4 November 2026

ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు కౌన్సెలింగ్‌

ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూ పరిధితో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీల పరిధిలో నిర్వహిస్తున్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు గురువారం కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఓయూ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కిషన్‌ తెలిపారు. ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ర్టీ, ఎంబీఏ, ఎం.ఏ ఎకనామిక్స్‌ కోర్సులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నామని, విద్యార్థులు అన్ని సర్టిఫికెట్లు, నిర్ణీత ఫీజుతో ఓయూలోని అడ్మిషన్స్‌ కార్యాలయంలో జరిగే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని వారు కోరారు.
రేపు పలు పీజీ కోర్సులకు కౌన్సెలింగ్‌
ఉస్మానియా యూనివర్సిటీ : ఓయూతో పాటు పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాం ధీ యూనివర్సిటీల పరిధిలో నిర్వహిస్తున్న ఎం.ఏ సైకాలజీ, ఏడాది వ్యవధి కలిగిన ఎంఎ ల్‌ఐఎస్సీ కోర్సులతో పాటు పలు పీజీ డిప్లొ మా కోర్సులకు గురువారం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఓయూ అడ్మీషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కిషన్‌లు తెలిపారు. విద్యార్థులు గురువారం ఉదయం ఓయూ అడ్మీషన్స్‌ కార్యాలయంలో జరిగే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *