అమ్మా…. ఒక్క అవకాశం ఇవ్వండి. ఆదరించి ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.

అమ్మా…. ఒక్క అవకాశం ఇవ్వండి. ఆదరించి ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.

తాండూర్ నియోజకవర్గ బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్.
తాండూరు అక్టోబర్ 13 (జనం సాక్షి) రాబోయే ఎన్నికల్లో తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి బోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ కోరారు. శుక్రవారం యాలాల మండలం బిజ్వార్ గ్రామంలో నియోజకవర్గ బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టసుఖాలను తెలుకోవటంతో పాటు బీఎస్పీ ఏనుగు గుర్తు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ముదిరాజ్ బిడ్డ నైనా నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
బీఎస్పీకి అవకాశం ఇస్తే పేద ప్రజలకు అండగా ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.
ఈ ప్రచారంలో బీఎస్పీ తాండూర్ అసెంబ్లీ ఇంచార్జ్ దొరశెట్టి సత్యమూర్తి , నియోజకవర్గ అధ్యక్షులు పి.అరుణ్ రాజ్, సోషల్ మీడియా ఇంచార్జ్ జైరామ్ ముత్యాల, పార్టీ నాయకులు రవి ముదిరాజ్, క్రాంతి ముదిరాజ్, గ్రామ నాయకులు, మునిందర్ ముదిరాజ్, బ్యాగరి గోపాల్, భీమ్ సేన్, తదితరులు పాల్గొన్నారు.