Wednesday, 4 November 2026

అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డిని ప్రజలు నమ్మరు

మోత్కూరు అక్టోబర్ 20 జనంసాక్షి :
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడం కాయమని ఆ పార్టీ మోత్కూరు యూత్ అధ్యక్షులు గనగాని రాజేష్ దీమ వ్యక్తం చేశారు.గురువారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.గత ఎన్నికల్లో ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశం కల్పిస్తే బీజీపీ యిచ్చిన వేల కోట్ల కాంట్రాక్ట్ పనులకు అమ్ముడు పోయి తన పదవికి రాజీనామా చేశారన్నారు.మత తత్వ బీజేపీని మునుగోడు ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజల్లో ఆదరణ ఉన్నదని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి బారీ మెజార్టీ తో గెలిపిస్తారని చెప్పారు.