Sunday, 8 November 2026

అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి) : పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసమితి నాయకుల అరెస్ట్ చేయడాన్ని  తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ఆదివారం ఓ ప్రకటనలో ఖండించారు.అరెస్ట్ చేసిన తెలంగాణ జనసమితి , విద్యార్థి , యువజన సమితి నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.