అర్బన్ మండల సరస్వ సమావేశం వాయిదా..

 ఎంపీటీసీల బాయి కాట్..
 గ్రామాల్లో ప్రాధాన్యం లేదని నిరసన..
సిద్దిపేట అర్బన్, సెప్టెంబరు 19( జనం సాక్షి): సిద్దిపేట అర్బన్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు బాయి కాట్ చేయడంతో వాయిదా పడింది. సోమవారం సమావేశం ఉంటుందని మండల్ అధికారి ప్రకటించినప్పటికీ సమయం వరకు ఒకరిద్దరు తప్పితే ప్రజాప్రతినిధులు కనిపించకపోవడం కేవలం అధికారులు మాత్రమే కనిపించడం జరిగింది. ప్రజా ప్రతినిధులను ప్రశ్నించగా ఎంపీటీసీలు సభను బహిష్కరణ చేసినట్లు తెలిసింది. గ్రామాల్లో సర్పంచులు తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పై స్థాయి అధికారులు కూడా తమకు ఏ విషయంలో అవకాశం కల్పించడం లేదని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎంపీటీసీల పరిస్థితి గ్రామాల్లో చాలా దయనీయంగా తయారైందని పేరుకు మాత్రమే ప్రజాప్రతినిధిగా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ప్రజా ప్రతినిధులు రాకపోవడంతో కేవలం అధికారులు మాత్రమే వచ్చినప్పటికీ సభను వాయిదా వేస్తున్నట్లు మండల అధికారి ప్రకటించారు.