Wednesday, 4 November 2026

అర్హులైన ఉపాధ్యాయులను కేటాయించమని వినతి

మల్లాపూర్‌,జూన్‌, 05(జనంసాక్షి): మండలంలోని ముత్యంపేట గ్రామంలోని పాఠశాలలో అర్హతలేని ఉపాధ్యాయులతో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహిన్నదానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామంలోని గ్రామస్తులు మండల విద్యాధికారికి మంగళవారం ఎమ్మార్సీ భవనంలో వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే పాఠశాలలోని విద్యార్థులకు కల్పించాల్సిన మౌళిక వసతులు సరిగా లేవని వెంటనే అట్టి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వారు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,యువకులు ఉన్నారు.