సికింద్రాబాద్ (జనం సాక్షి ) సికింద్రబాద్, చిలకలగూడా, గాంధీ విగ్రహం వద్ద బీజేపీ సికింద్రాబాద్ బీజేపీ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళితులను మోసం చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడని తెలిపారు.. అందులో భాగంగా ఎన్నికలకు ముందు దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, ప్రతి దళితునికి 3ఎకరాల భూమి ఇస్తానన్నాడు.. కానీ ఎన్నికలు ఐపోగానే తానే దళితునిగా సర్టిఫికెట్ తీసుకొని ముఖ్యమంత్రి అయిపోయడని ఘాటుగా విమర్శించారు.. కానీ ఇప్పుడు మరొక్కసారి మోసం చేయాలని చూస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. అర్హుడైన ప్రతి దళితుతుడికి దళితబందు ఇచ్చేవరకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని వెల్లడించారు..
అర్హులైన దళితులందరికి దళిత బందును అందించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ లో బీజేపీ నేతలు నిరసన దీక్ష




