దేవదాసులో అంవతా భ్రాంతియేనా పాటతో గుర్తింపు
హైదరాబాద్,జూలై14(జనం సాక్షి): అలనాటి గాయని కె.రాణి(75) కన్నుమూశారు. హైదరాబాద్లోని కల్యాణ్నగర్లోని తన పెద్దకుమార్తె విజయ నివాసంలో శుక్రవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాస్’ చిత్రంలోని అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా పాటతో ఆమె ప్రసిద్ధిగాంచారు. సావిత్రిపై దీనిని చిత్రీకరించగా బహుళ ప్రాచుర్యం పొందింది. తెలుగులో సుమారు 500పైగా పాటలు ఆలపించారు. శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా ఈమెనే ఆలపించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, సిన్హల, ఉజ్బెక్ భాషల్లో పాటలు పాడారు. ‘రూపవతి’ చిత్రంతో తన సినీ కెరీర్ను ఆరంభించిన రాణి.. ‘బాటసారి’, ‘జయసింహ’, ‘ధర్మదేవత’, ‘లవకుశ’ వంటి చెప్పుకోదగ్గ చిత్రాల్లో తన పాటలు ఆలపించారు. రాణి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.




