మోమిన్ పేట ఆగస్టు 26 జనం సాక్షి
శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్*మర్పల్లి మండల పరిధిలోని *పట్లూరు గ్రామంలో 182* మరియు మొగిలిగుండ్ల గ్రామంలో 29 మందికి* నూతనంగా మంజూరు చేసిన మొత్తం *211* మందికి లబ్ధిదారులకు మంజూరైన *ఆసరా పెన్షన్ కార్డులను* అందజేశారు.
జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కుటుంబ భారాన్ని భుజస్కంధాలపై మోసినటువంటి… అలసిన గుండెలకు వృద్ధాప్యంలో వెన్నుదన్నుగా నిలుస్తూ… దేశంలో ఎక్కడ లేనివిధంగా *గౌరవప్రదమైన పెన్షన్* అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ, కెసిఆర్ సార్ ప్రభుత్వం అన్నారు.
అనంతరం పట్లూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో *75వ స్వతంత్ర భారత* వజ్రోత్సవాల సందర్భంగా ముగ్గుల పోటీలో గెలుపొందిన బాలురకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మధుకర్ గ్రామ సర్పంచ్ ఇందిరా అశోక్ ఎంపీపీ సుశీల రమేష్ వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షు శ్రీకాంత్ రెడ్డి మండల రైతు సంఘం అధ్యక్షుడు నాయక్ గౌడ్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




