ఉత్సవాలను శాంతి యుతంగా జరుపుకోవాలి. సి ఐ వెంకటేశ్వర్లు
ఏర్గట్ల ఆగష్టు 26 (జనంసాక్షి) : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం యువజన సంఘాల సభ్యులకు శాంతి కమిటీ సమావేశం నిర్వహించి పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని భీంగల్ సి ఐ వెంకటేశ్వర్లు అన్నారు. వినాయక చవితి పండగలను యువకులు శాంతియుతంగా నిర్వహించాలని, గణేష్ మండపాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, మండపాల వద్ద భక్తులకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, జడ్పీటిసి గుల్లె రాజేశ్వర్, తహశీల్దార్ జనార్దన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజ పూర్ణనందం, ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు మధుసూధన్, సొసైటీ చైర్మన్ బర్మ చిన్న నర్సయ్య, ఏయస్ఐ గంగాధర్, హెడ్ కానిస్టేబుల్ సెర్లక్, కానిస్టేబుల్ గంగాధర్, నరేష్, శ్రీధర్, మండలంలోనీ అన్ని గ్రామాల యువజన సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.