అలాయి బలాయి కార్యక్రమానికి భారీ జన సమీకరణ
రేగోడు/ జనం సాక్షి అక్టోబర్
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ వట్టిపల్లి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన అలాయి బలాయి కార్యక్రమానికి రేగోడ్ తో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుండి నాయకులు ప్రజాప్రతినిధులు అభిమానులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి కాంతి కిరణ్, జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులను కలిసి జంబి ఆకును ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తరలి వెళ్లిన వారిలో ప్రధాన కార్యదర్శి సుంకి రమేష్, సర్పంచులు బాదనపల్లి నరసింహులు,మచ్చుకూరి రవీందర్, తుకారాం, సిద్ధారెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ రేగోడు గ్రామ అధ్యక్షుడు రాచొటి సుభాష్ నాయకులు భూమిరెడ్డి, హమీద్, యేసయ్య, గొల్ల కృష్ణ, అభిమానులు తదితరు తల్లి వెళ్లారు.