అల్లాదుర్గం వద్ద స్లిప్ రోడ్డు ఏర్పాటు

అల్లాదుర్గం, అక్టోబర్ 1:
161వ జాతీయ రహదారి అల్లాదుర్గం వద్ద స్లిప్ రోడ్డు
ఏర్పాటుకు ఎన్ హెచ్ ఎ ఐ అనుమతి ఇచ్చినట్లు అల్లాదుర్గం సర్పంచ్ అంజియాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.161వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అల్లాదుర్గం వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. సుమారు 15 కిలో మీటర్ల వరకు స్లిప్ రోడ్డు  లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ప్రయాణీకుల ఇబ్బందులు దృష్ట్యా అల్లాదుర్గం వద్ద స్లిప్ రోడ్డును ఏర్పాటు చేయాలని ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి , మాజీ ఎంపిపి కాశినాథ్  ఎమ్మెల్యే  క్రాంతికిరణ్,మంత్రి హరీశ్ రావు ,ఎంపి బీబీబాటిల్ దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన ఎన్ హెచ్ ఎఐ అల్లాదుర్గం వద్ద స్లిప్ రోడ్డు ఏర్పాటుకు కెఎన్ ఆర్
సంస్థ కు ఆదేశాలిచ్చింది . సహాకరించిన ఎమ్మెల్యే ,మంత్రి ,ఎంపీ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు