అల్లాపూర్ కుస్నూర్ గ్రామాల్లో వంతెన పై నుండి వరద నీరు ఉదృతం గా ప్రవహిస్తుంది.

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 20 రాయికోడ్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాయికోడ్ మండలంలో ఏక ధాటిగా రెండు గంటల పాటు కురిసిన వర్షానికి అల్లాపూర్ శివారులోని వంతెన పై నుండి వరద నీరు ఉదృతం గా ప్రవహిస్తుంది. వరద నీరు ఉదృతం గా ప్రవహించడంతో కుస్నూర్ తో సహా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయ క్షేత్రం లో పనులు పూర్తిచేసుకొని తిరిగి వచ్చిన రైతులు వంతెన ధాటలేక తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు.ప్రతి వర్షా కాలం ఇలాగే వరద కారణంగా వంతెనను దాటేందుకు ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. భారీ వర్షం కారణంగా పంట పొలాలు నిట మునిగాయి. పత్తి పంట పూర్తిగా వరద నీటిలో మునగడం తో రైతన్నలు ఆవేదన వ్యక్తంచేశారు.