Tuesday, 3 November 2026

అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

సర్పంచ్ అభ్యర్థి ఆకుల శివ కుమార్
 తాండూరు జనవరి13( జనం సాక్షి)
 గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ సర్పంచ్ అభ్యర్థి ఆకుల శివ కుమార్ గ్రామ ప్రజలను కోరారు. ఆదివారం యాలాల మండలం దేవనూరు గ్రామంలో గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఆకుల శివ కుమార్ మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇస్తే అత్యధికంగా అభివృద్ధి చేసి మండల కేంద్రంలోని  దేవనూర్ గ్రామాన్ని మొదటి స్థానం లో నిలుపుతాం అని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. యువతకు అవకాశం ఇవ్వండి అని వేడుకున్నారు ..యువతతోనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని ,నూతన పద్ధతులను ప్రవేశపెడతామని, గ్రామ అభివృద్ధి తమ దేహమని అన్నారు. గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు.