నిర్మల్,మే31(జనం సాక్షి): రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఎం.ప్రశాంతి అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలో నలుదిక్కులా తోరణాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. అన్ని శాఖలు సమన్వయ పర్చి వేడుకలను నిర్వహించాలని, జిల్లా గ్రావిూణాభివృద్ధి అధికారిణి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఇప్పటికే సవిూక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా గ్రావిూణాభివృద్ధి, పాఠశాలల్లో తెలంగాణ సంస్కృతిపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పండుగ వాతావరణం కనిపించాలన్నారు. కళాకారులతో కలెక్టరేట్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. దవాఖానల్లో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేయాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాల్లో, అనాథాశ్రమాల్లో పండ్లు, స్వీట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి పంపిణీ చేయాలన్నారు.
——–




