Monday, 2 November 2026

అవసరాలకు లోటు రాకుండా ఇసుక సరఫరా

నిజామాబాద్‌,ఫిబ్రవరి24జనం సాక్షి): వ్యక్తిగత అవసలతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడడాలని, అలాగే అవసరాలకు కొరత లేకుండా చూసుకోవాలన్నారు. బోధన్‌ మండలం పెగడాపల్లి ప్రభుత్వ క్వారీ, మెండోరా మండలం పొతంగల్‌లోని నాలుగు పట్టా భూముల్లో ఇసుక తీసేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. ప్రజల వ్యక్తిగత అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ నియమ, నిబంధనలు అమలుచేయాలని అన్నారు. అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.