హైదరాబాద్,ఫిబ్రవరి24(జనం సాక్షి): రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ గెలవడంతో దేశానికి దిశానిర్దేశం చేసే పార్టీగా టిఆర్‌ఎస్ నిలిచిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ దేశం మొత్తానికి తెలంగాణ ఆదర్శంగా ఉంది. దేశంలో ఎవరూ చేయలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. అద్భుతమైన పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌ను దేశం మొత్తం కోరుకుంటుంది. జాతీయ నాయకుల కంటే ఎక్కువగా దేశంపై అవగాహన ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే అని అన్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారని పేర్కొన్నారు. కెటిఆర్ నాయకత్వం దేశానికి అవసరమని అన్నారు. అందుకే ఫెడరల్ ఫ్రంట్‌కు ప్రజలు ఆమోదం తెలపబోతున్నారని అన్నారు.




