అశ్వరావుపేట లోఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు
అశ్వరావుపేట అక్టోబర్ 9( జనం సాక్షి )
వాల్మీకి జయంతి ఉత్సవాలు అశ్వరావుపేటలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అశ్వరావు పేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అశ్వరావుపేటలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వాల్మీకి ఓ ఆదర్శప్రాయుడిగా మహోన్నతమైన జీవితాన్ని గడిపారని అభి వర్ణించారు. ఆయననే మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వాల్మీకి రామాయణాన్ని రచించారని, రామాయణం ఒకసారి చదివితే సేవ మార్గంలో ఎలా నడవాలి అనేది తెలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి రామ్మోహన్రావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, ఎంపీటీసీ వేముల భారతి, తెరాస పార్టీ నాయకులు సంపూర్ణ, చిప్పనపల్లి బజార్ అయ్యా, ఎస్.కె ముబారక్ బాబా, ఆలయ కమిటీ మెంబర్లు, యువకులు, నల్ల బోతుల నాగు, శ్రీను, రమణ, పాపారావు, తదితరులు పాల్గొన్నారు.