అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 19
అల్వాల్ పట్టణ కేంద్రంలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఇంచార్జ్ అశ్విని కుమార్ పుట్టినరోజు సందర్భంగా అల్వాల్ కంటోన్మెంట్ అధ్యక్షులు విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది కాలంలోనే సంఘం కొరకు మంచి పేరు నాయి బ్రాహ్మణ సంఘం అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తున్న సంఘం సైన్యంలో ఒక సైనికుడిలా తన వంతు సహకారం అందిస్తున్న అశ్విని కుమార్ కి అభినందనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాంబాబు, మనోహర్, శంకరయ్య, బాలయ్య, శ్యామ్ రావు నాయి, రాజు నాయి, రవి నాయి, కుమార్, లింగరాజు, ఆనంద్ సాగర్, నరేష్, జాన్ పాల్, తదితరులు పాల్గొన్నారు.




