Tuesday, 3 November 2026

అసలు డేరాబాబు చంద్రబాబే

కొడాలినాని మండిపాటు

హైదరాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): జగన్‌ను డేరాబాబా అంటున్న సిఎం చంద్రబాబే అసలు డేరా బాబా అని

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్లే నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. సొంత నియోజకవర్గంలో గెలవలేకపోయిన ఆయన సొల్లు చెబుతున్నారని మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే 20మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. ఇంకా దమ్ముంటే 175 స్థానాల్లో పోటీకి రావాలన్నారు. అప్పుడు తాము రెఫరెండంగా స్వీకరిస్తామని అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విూడియా సమావేశంలో మాట్లాడారు.

డేరా బాబా గురువు చంద్రబాబా అని, సీబీఐ విచారణ జరిపితే జీవితాంతం జైల్లోనే ఉంటావని హెచ్చరించారు. చంద్రబాబు నమ్మకద్రోహి, దొంగ అని స్వయంగా ఎన్టీఆరే చెప్పారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావును అడిగినా చెబుతారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తిని అడిగినా చెబుతారు అని ఎమ్మెల్యే నాని ధ్వజమెత్తారు.చంద్రబాబు పోటుగాడు కాదు…అనుభవజ్ఞుడు కాదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు ఎంపీ స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయాడు. 44 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే…21చోట్ల చంద్రబాబు డిపాజిట్‌ కోల్పోయారు. పది స్థానాలతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలో 250మందికి పోస్టల్‌ బ్యాలెట్స్‌ ఇస్తే 39మంది పంపారు…అవి కూడా చెల్లలేదు. అంటే ఉద్యోగులు వాళ్ల నిరసనను ఈ విధంగా తెలిపారు. ఇప్పటివరకూ నారావారిప్లలెలో ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే.. మూడుసార్లు మినహా అన్నిసార్లు ఓడిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సొంత నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేకపోయింది. కానీ చంద్రబాబు సొల్లు చెబుతారు. ఇందిరాగాంధీ, రాహుల్‌ గాంధీతో పోరాటం చేశానంటాడు. మనం వింటే బ్రిటీష్‌ వారితో కూడా పోరాటం చేశానని సొల్లు చెబుతారు. ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్‌పై కూడా పోటీ చేస్తానన్న నీచచరిత్ర చంద్రబాబుది.’ అని తూర్పారబట్టారు.

ఇక ఎమ్మెల్యే, ఎంపీ సీటుతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభమైందని, ఎన్ని సమస్యలు, కష్టాలు

వచ్చినా అన్నమాట విూద నిలబడే వ్యక్తి. జగన్‌ అని అన్నారు. మాట తప్పని, మడమ తిప్పని పోరాట యోధుడు. చంద్రబాబులా దొంగదారులు వెతుక్కునే వ్యక్తి కాదన్నారు. అలాంటి వ్యక్తిపైనా విమర్శలా. మా పార్టీ గుర్తుపై గెలిచినవారా మా నాయుకుడిన విమర్శించేది.మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అని కొడాలి నాని అన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని చంద్రబాబు గొప్పలు చెబుతారు. కానీ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబునే కేసీఆర్‌ విజయవాడ పటంలో పెట్టారు. చంద్రబాబు ఎలాంటి రాజకీయాలు చేస్తారో అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.