న్యూఢిల్లీ,ఆగస్ట్29(జనంసాక్షి): నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్‌చంద్ ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్, ¬ంశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్మరించుకున్నారు. ఢిల్లీలోని హాకీ స్టేడియంలో ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు. స్పోర్ట్స్ కల్చర్‌తో పాటు క్రీడల్లో టెక్నాలజీ అన్న అంశంపై ప్రసంగించారు. ఈ సందర్బంగా నేషనల్ స్పోర్ట్స్ ట్యాలెంట్ సెర్చ్ పోర్టల్ ను కేంద్ర క్రీడాశాఖ మంత్రి ప్రారంభించారు.




