హైదరాబాద్,జూన్2(జనం సాక్షి): తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మాగాంధీ, డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించిన స్పీకర్ మధుసూదనాచారి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని.. బంగారు తెలంగాణ సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ భవన్లో రాష్ట్ర¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ జాతీయ జెండాను ఎగురవేశారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందని నాయిని అన్నారు. ఖమ్మం తెరాస పార్టీ కార్యాలయంలో మంత్రి తుమ్మల జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకలకు హాజరయ్యారు.




