హైదరాబాద్,(జనంసాక్షి): శాసన సభలో ఇవాళ విపక్షాలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టనున్నాయి. విద్యుత్ ఛార్టీల పెంపు, విద్యుత్ కోతలపై వైఎస్సార్సీపీ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై సీపీఐ, వికలాంగుల సమస్యలపై సీపీఎం, విద్యుత్ సమస్యలపై టీడీపీలు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలను రెండు రోజులపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నిన్న స్పీకర్ నాదెండ్ల ప్రకటించిన విషయం తెలిసిందే.




