Wednesday, 4 November 2026

అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు

దేశంలో ఏడేండ్లలో కొత్తగా 7 ఐఐఎంలు కేటాయిస్తే అందులో
తెలంగాణకు కేటాయించినవి సున్నా!

ఐఐటీలు 7 ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఇచ్చినవి సున్నా!

ఐఐఎస్‌ఈఆర్‌లు రెండు నెలకొల్పితే.. తెలంగాణలో నెలకొల్పినవి సున్నా!

ట్రిపుల్ ఐటీలు దేశవ్యాప్తంగా 16 ఏర్పాటు చేస్తే.. తెలంగాణలో ఏర్పాటుచేసినవి సున్న!

ఎన్‌ఐడీలు దేశంలో నాలుగు పెడితే.. తెలంగాణలో పెట్టినవి సున్నా!

వివిధ రాష్ర్టాల్లో మొత్తం 157 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలో ఏర్పాటు చేసినవి సున్నా!

నవోదయ పాఠశాలలు కొత్తగా 84 నెలకొల్పితే.. తెలంగాణలో సున్నా!

వీటిని తెప్పించేందుకు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు చేస్తున్న కృషి.. పెద్ద గుండు సున్నా!