తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో మరియు ఎల్. యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారం తో జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం స్థాయి దసరా కోలాట సంబరాల ఫోటీలు ధర్మపురి ప్రభుత్వ కళాశాల వేదికగా నిర్వహించనున్నారు.
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గ తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత దసరా కోలాటాల సంబరాల పోటీలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు
ఈ సందర్భంగా స్నేహలత గారు మాట్లాడుతూ….
ధర్మపురి నియోజకవర్గం స్థాయి దసరా కోలాట సంబరాల పోటీలు ముఖ్య ఉద్దేశ్యం నియోజకవర్గ మహిళల ప్రతిభను చాటి చెప్పటానికి,మహిళలను ఒకే వేదికపై తీసుకురావాలని చేస్తున్నా ప్రయత్నం….
ప్రకృతి పండుగ బతుకమ్మ పండుగ, ఈ పండుగ ఆడబిడ్డల పండుగ, ప్రపంచంలో ప్రకృతి ఆరాధించే అరుదైన పండుగ ఏది అంటే ఏమాత్రం సందేహం లేకుండా చెప్పే పండుగ.. బతుకమ్మ పండుగ.
బతుకమ్మ అంటే ప్రకృతే. ఆడపిల్లలను ‘బతుకు అమ్మా’అని మనసారా ఆశీర్వదించే పండుగ ఈ బతుకమ్మ పండుగ
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఆడపడుచు ఇష్టమైన బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే గుర్తింపు పొందింది, దీనికి ముఖ్య కారణం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ యంపి, ప్రస్తుత నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారే,
ఈ పోటీలు ఈ నెల 22-9-2022 తేదీ నుండి ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్నేహలత గారు తెలిపారు.
ఈ కోలాట సంబరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ సెప్టెంబర్ 13.వ తేది నుండి సెప్టెంబర్ 20.వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు,
బహుమతుల వివరాలు
*నగదు బహుమతులు :
ప్రథమబహుమతి: *రూ50,000/-
ద్వితీయబహుమతి: రూ30,000/-
తృతీయబహుమతి: రూ20,000/-
ప్రతిభ కనబర్చిన మహిళకు ప్రత్యేక వ్యక్తిగత కన్షోలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.
పోటీకి ఎటువంటి ఎంట్రీఫీజు లేదు
ధర్మపురి నియోజకవర్గ నుండి మొట్టమొదటి సారి మహిళల కోసం నిర్వహిస్తున్న ఈ పోటీలకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు..




