Tuesday, 3 November 2026

అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా

రాష్ర్ట శాసనసభ, శాసన మండలి రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం ప్రారంభమైన ఉభయ సభల్లో రైతు సమస్యలపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రశ్నోత్తరాల అంశాన్ని కూడా ఎత్తివేసి పూర్తిగా రైతుల సమస్యలపై కేంద్రీకరించారు. అన్ని పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. రైతులకు ఆత్మస్థయిర్యం కలిగించాల్సిన అవసరం ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు. రైతుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. సభ్యుల సలహాలు, సూచనలు, అభిప్రాయాలపై ప్రభుత్వం రేపు వివరణ ఇవ్వనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *