Monday, 2 November 2026

మరో చైన్ స్నాచింగ్

89హైదరాబాద్ : నగరంలో చైన్‌స్నాచర్లు మంగళవారం రెచ్చిపోయారు. ఫిల్మ్ నగర్ లో రోడ్ క్రాస్ చేసేందుకు రోడ్డు పై వెయిట్ చేస్తుండగా మెడలో ఉన్న గొలుసును లాగడంతో ఆ మహిళ వెంటనే కింద పడిపోయింది. విచారణ చేపట్టిన పోలీసులు బండి నెంబర్ ను కనుగొన్నట్లు సమాచారం. ఉదయం సమయంలో ఫిలింనగర్, సంజీవరెడ్డి‌నగర్ ఏరియాలో మూడు చోట్ల చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి దాదాపు పది తులాల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఇక మధ్యాహ్న సమయంలో కూకట్‌పల్లిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్ నెం 2లో ఓ మహిళ మెడలోంచి రెండు తులాల గొలుసును లాక్కెళ్లారు. అలాగే… ధర్మారెడ్డి కాలనీలో కూడా మరో మహిళ మెడలోంచి తులంన్నర బంగారు గొలుసును కూడా లాక్కెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం వరకు నగరంలో మొత్తం ఐదుచోట్ల చైన్‌స్నాచింగ్‌లు జరగడంతో బయటకు రావాలంటే మహిళలు హడలెత్తిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *