అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి.

రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ ధన్యా కుల భాస్కర్ రెడ్డి.
దౌల్తాబాద్ సెప్టెంబర్ 11, జనం సాక్షి.
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకై రెడ్డి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 13న అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయాలని రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ ధన్యా కుల భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల క్రితం ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్ నేటికీ అమలు చేయకుండ మాట తప్పడం సిగ్గుచేటన్నారు. రెడ్డిలను రాజకీయంగా వాడుకుంటు తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. రెండు వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 13న రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట నుండి ఐదు వేల మంది రెడ్డి సోదరులతో కలిసి అసెంబ్లీ ముట్టడికి వెల్లతున్నట్లు వేల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.