Tuesday, 3 November 2026

అసోంలో మైనర్ బాలికపై ఎమ్మెల్యే అత్యాచారం..

  • 0
    Share

అసోం: తన ఇంట్లో పనిచేసే బాలికపై అత్యాచారం చేసిన కేసులో అసోంలో ఓ ఎమ్మెల్యే అరెస్టయ్యాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల రోజులుగా తప్పించుకు తిరుగుతున్న బొకొ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు గోపినాథ్ దాస్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అమింగాన్ ప్రాంతంలో దాస్‌ను అరెస్ట్ చేసినట్లు కామృప్ ఎస్పీ ఇంద్రాణి బారువ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే దాస్ తన ఇంట్లో పనిచేస్తున్న 14 ఏళ్ల బాలికను అగస్టు 29న కారులో తీసుకెళ్లి గువహటి ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను అక్కడే వదిలి వెళ్లాడు. బాధిత బాలిక దీనిపై బొకొ పోలీసుస్టేషన్ పరిధిలోని మందిరా ఔట్‌పోస్టులో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా పరారీ అయ్యాడు. ఈ నేపథ్యంలో దాస్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఆదివారం నాడు అమింగాన్ ప్రాంతంలో అతన్ని పట్టుకున్నారు. ఏఐయూడీఎఫ్ పార్టీకి చెందిన దాస్, బొకొ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. కుట్రపూరిత ఉద్దేశంతోనే బాలిక తనపై అత్యాచార ఆరోపణలు చేస్తోందని దాస్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *