అస్కార్‌ అవార్డుల వేడుక ప్రారంభం

లాన్‌ఏంజిల్స్‌ : 85వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆకట్టుకునే దుస్తుల్లో తారలు రెడ్‌కార్పెట్‌పై నడుస్తూ తళుక్కుమన్నారు. భారతీయ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ లైఫ్‌ ఆఫ్‌ పై’ 11 విభాగాల్లో నామినేట్‌ అయింది. ఉత్తమ చిత్రం విభాగంలో ‘ లైఫ్‌ ఆఫ్‌ పై’తో పాటు 9 సినిమాలు పోటీపడుతున్నాయి.