అహింస సూత్రాన్ని ప్రపంచానికి చాటిన గాంధీ
… ఫ్రీడం రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 11, ( జనం సాక్షి) : అహింస సూత్రాన్ని ప్రపంచానికి చాటిన మహోన్న త వ్యక్తి గాంధీ అని తెలంగాణ తొలి ఉప ముఖ్య మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అ న్నారు.నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవోకార్యా లయం ముందు భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖఆధ్వర్యంలో చేపట్టిన ఫ్రీడం రన్ ను ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణతొలి ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఫ్రీడం రన్నును ప్రారంభించారు. అనం తరం ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు,ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ శాఖ, యువకులు,విద్యార్థులు, పార్టీ శ్రేణులతో కలిసి భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకొని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఫ్రీడం రన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర భారతకీర్తిని దశదిశలా చాటేందుకే భారత స్వతం త్ర వజ్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే ఫ్రీడం రన్ చేయడం జరిగిం దని తెలిపారు.ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో పెద్ద దేశం భారతదేశం అని అన్నారు.మనదేశాన్ని సుమారు 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ వారు పరిపాలించారని, ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితం వెరసి మహాత్మా గాంధీ శాంతియుతంగా అహింసా మార్గం ద్వారా వందేమాతరం నినాదం తో స్వతంత్ర పోరాటాలు చేయడం ద్వారా 1947 ఆగస్టు 15 న భారతదేశనికి స్వాతంత్రం రావడం జరిగినదని అన్నారు.అప్పటి వరకు ఉన్న 548 స్వతంత్రరాజ్యాలను ఆరాజులను ఒప్పించిమనం దరం సమైక్యంగా ఉందామని చెప్పిభారతదేశంలో విలీనం చేసిన ఘనత గాంధీ , నెహ్రూ, సర్దార్ వల్ల భాయ్ పటేల్ లాంటి ఆనాటి మహనీయులదని అన్నారు.స్వాతంత్రం వచ్చే నాటికి తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేదని కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం శాఖ మంత్రిగా ఉండి నిజాం రాజును ఒప్పించి 1948 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ అప్పటి నిజాం నవాబ్ ఓడంబడక మీద సంతకం చేశారని తెలిపారు. కావున సెప్టెం బర్ 17 న మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని తెలిపారు. అంటే ఈ ప్రాంత ప్రజలకు ముక్తి కల్పించడం జరిగినది. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితోనే ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేకతెలంగాణరాష్ట్ర ఉద్యమం చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు.భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75సం వత్సరాలు అవుతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా వినూత నమైన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీ ఆర్ పిలుపునిచ్చి ఆగస్టు 8 నుండి 22 వ తారీకు వరకు రోజువారిగా స్వతంత్ర భారత కీర్తిని దశది శలా చాటేందుకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఏసీపీ రఘు చందర్, తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్, సీఐ ఎడ వెల్లి శ్రీనివాస రెడ్డి ,ఎస్ ఐ శ్రావణ్ , ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.