
మునిపల్లి, జూలై 21, జనంసాక్షి : ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నే మళ్ళీ గెలిపించండి అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం నాడు హైదరాబాద్ లో టీఎస్టీపీసీ చైర్మన్ గా మఠం బిక్షపతి పదవి స్వీకరణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అడుగు జాడల్లో నడుస్తూ అయన గెలుపు కోసం కృషి చేసారని గుర్తు చేశారు. ఈ సారి కూడా క్రాంతిని భారీ మెజారిటీతో గెలిపించడానికి బిక్షపతి చేయూత, పదవి ఉపయోగ పడుతుందని తాను విశ్వాసిస్తున్నాని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. సామాన్య కార్యకర్తగా గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన బిక్షపతికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి రావడం మాములు విషయం కాదన్నారు. జాగృతిలో క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తూ ఇవాళ కేసీఆర్ గారి మన్ననలు పొంది చైర్మన్ పదవిని సాధించారని తెలిపారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీ సమూచిత స్థానం కల్పింస్తుదని తెలిపారు. అయితే ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై కవిత చేసిన కామెంట్స్ తో, సోషల్ మీడియాలో క్రాంతి కిరణ్ కు టికెట్ రాదని విషప్రచారం చేసిన వారి నోళ్లు మొగబోయే పరిస్థితి ఏర్పడింది.




