వ్యాధిరాకుండా ఉండాలంటే 6 నెలల వరకు తల్లిపాలివ్వాలి
మూడు నెలల్లోపు వారికి 60 ఏళ్లు పైబడినవారికి ప్రమాదం
హైదరాబాద్,జూన్29(జనం సాక్షి ): ప్రపంచంలో ప్రతి ఏటా న్యూమోనియా వ్యాధివల్ల 9లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారని దీనిని తగ్గించడమే ప్రధాన కర్తవ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా న్యూమోనియా వ్యాధిని నివారించేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 9 లక్షల మంది మరణిస్తే ఇందులో భారత్లోనే అత్యదికంగా 40 శాతం మంది మరణిస్తున్నారని వైద్యులు అంటున్నారు. అంతేకాక ఇందులో తెలంగాణాలో కూడా మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటోందన్నారు. ఈవ్యాధి వచ్చాక చికిత్సకోసం తాపత్రయ పడేకంటే నివారణ మార్గాలు అవలంబించడమే ప్రధన కర్తవ్యమన్నారు. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ తయారుచేసిన న్యూమోనియా టీకాలను ప్రతి చిన్నారికి కూడా ఆరు, 10, 14వారాల్లో ఖచ్చితంగా వేయించాలన్నారు. 5 ఏళ్లలోపు ప్రతి ఒక్కరికి వేయిస్తేనే న్యూమోనియా వ్యాధి రాకుండా ఉంటుందన్నారు. శిశుమరణాలు తగ్గించడమే ప్రథాన కర్తవ్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈవ్యాధి సూక్ష్మ క్రిముల వల్ల సోకుతుందని, దీనిని అరికట్టడం కంటే నివారించడమే ప్రధాన బాధ్యతగా పనిచేయాల్సిఉందన్నారు. తెలంగాణాలో ప్రతి వెయ్యిమంది చిన్నారుల్లో 40 మంది మరణిస్తున్నారన్నారు. 2030కల్లా ఈ మరణాలను 9లోపుకు తగ్గించేందుకు సామాజిక వేత్తలు, వైద్యులు, స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలన్నారు. ఈరోజుల్లో తల్లి పిల్లలకు పాలిచ్చేందుకు వెనుకంజ వేయడం కూడా రోగం పెరగడానికి కారణంగా అవుతుందన్నారు. ప్రతి తల్లి కూడా తనకు జన్మించిన బిడ్డకు ఖచ్చితంగా ఆరు నెలల వరకు పాలనే ఇవ్వాలన్నారు, దీంతో భవిష్యత్లో ఈ వ్యాధి వారికి రాకుండా నిరోధించగలమని అన్నారు. అంతేకాక ఖచ్చితంగా ఏడాదిన్నరలోపు మూడు ఐదేల్లలోపు మరోటి నాలుగో టీకాను వేయించాల్సిందేనన్నారు. ఈ మందును తెలంగానాలో ఉచితంగా ఇవ్వాలని అసోసియేషన్ పక్షాన ప్రభుత్వాన్ని కోరామన్నారు. ప్రక్కనున్న ఆంద్రప్రదేశ్లో డయేరియా టీకా మందును అక్కడి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచితంగా అందిస్తుందని, దీనిని చూసిన తెలంగాణా ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి ఉచితంగా ఇస్తానందన్నారు. అలాగే ప్రాణాంతకమైన న్యూమోనియా వ్యాధి టీకాలను కూడా ఉచితంగా వేయించేందుకు కృషిచేయాలన్నారు. అంతేకాక రోగులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ, వ్యక్తిగతంగా సమయం కేటాయించి అవగాహనకల్పిస్తామన్నారు.




