Monday, 2 November 2026

ఆంధ్రా దురాహంకారం…. మే 2న మెదక్‌ జిల్లా బంద్‌

అధినేత కేసీఆర్‌ పిలుపు
హైదారాబాద్‌, జనంసాక్షి : బయ్యారం గనులను విశాఖ స్టీల్స్‌కు తరలించి తీరతమని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మే 2న మెదక్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. బయ్యారం గనుల విషయంలో సీఎం కిరణ్‌ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా, అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని కేసిఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం రాత్రి ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. గనుల తరలించి సీఎం మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో జరిగిన సభలో మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మెదక్‌ జిల్లా బంద్‌తో ఉద్యమనికి శ్రీకారం చుట్టి మే నెలలో భూకంపాన్ని సృష్టిస్తామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *