ఆకతాయిల ఆగడాలపై ప్రత్యేక నిఘా — జిల్లా ఎస్పీ చంద్రమోహన్

మహిళల భద్రతకు ప్రతిష్టాత్మకంగా పని చేస్తున షీ టీమ్ లు

– ఫిర్యాదుల స్వీకరణకు ప్రజలకు అందుబాటులో సాంకేతిక పరిజ్ఞానం

– క్యూఆర్ కోడ్ ద్వారా ఉన్న చోటు నుండే వేధింపులపై నిమిషాల్లో ఫిర్యాదు

మహబూబాబాద్, క్రైమ్ ( సెప్టెంబర్ 1) జనం సాక్షి న్యూస్ :

మహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ టీమ్ బృందాలు అధికారుల పర్యవేక్షణ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పని చేస్తున్నాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ చంద్ర మోహన్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ లు ఆకతాయిలు ఆగడాలకు అడ్డుకట్టు వెస్తునాయని అన్నారు.
రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, విద్యాసంస్థల , దేవాలయాలు పరిసర ప్రాంతాల్లో షీ టీమ్ పోలీసులు మఫ్టీలో ఉంటూ ఆకతాయిలకు చెక్ పెడుతున్నామని అన్నారు . మహబూబాబాద్, తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలలో షీ టీం పోలీసులు ఆ శాఖ పనితీరుపై బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ముఖ్య కుడలులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రస్తుత తరుణంలో మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి పనిచేస్తున్నారని తాము పనిచేస్తున్న రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని, అలాంటి వారికి షి టీమ్స్ ఎల్లపుడు అండగా నిలుస్తూ దైర్యన్ని ఇస్తాయన్నరు. అవగాహన కార్యక్రమాలు పెంచడం ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యంగా ముందుకు వస్తారని షీ-టీమ్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయని అన్నారు.
తమకు వచ్చిన ఫిర్యాదులను స్వీకరిస్తూ ఆకతాయిల ఆగ డాలను వీడియో రికార్డ్ చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో కేసులు సైతం నమోదు చేస్తున్నామని అన్నారు.
ఆకతాయిలు వెంటపడి వేధించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తే 100, 112, తో పాటు 7901142009, 8712656935 వాట్సప్ నంబర్ లో సంప్రదించాలని , ఉన్నచోట నుండి ఫిర్యాదు చేయడానికి క్యూఆర్ . తెలంగాణ స్టేట్ పోలీస్ . గౌట్ . ఇన్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. బస్టాండ్, పాఠశాలలు, కళాశాలల వద్ద మహిళ లను వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాంమని అన్నారు.జిల్లా పరిధిలోని పోలీసు స్టేషన్ లలో మహిళల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పాఠశాలలు, కళాశాలల వద్ద షీ-టీమ్ ఫోన్ నంబర్లు తెలిసేలా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు నిర్భయంగా ముందుకు రావాలని తెలుపుతూ, వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు.

2023 ఆగస్ట్ నెలలో మహబూబాబాద్ జిల్లా పరిధిలో షి టీమ్స్ నిర్వహించిన కార్యక్రమాలు చూసినట్లయితే
షి టీమ్స్ బృందం 1, అవగాహన కార్యక్రమాలు 12, షి టీమ్ సభ్యులు ఇప్పటి వరకు సందర్శించిన ప్రాంతాలు 45, వారు
రిజిస్టర్ చేయించిన కేసులు9,
రెడ్ హ్యాండెడ్ కేసులు 8, మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు సబ్ డివిజన్లో ఒక గ్రామంలో ఒక స్కూల్ విద్యార్థి అయిన మైనర్ బాలికను తనకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి వెంటపడి వేదించగా అమ్మాయి వ్యతిరేకించడంతో అబ్బాయి తన కుటుంబ సభ్యుల పై దాడి చేయగా అట్టి వ్యక్తిపై షి టీం కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది. తర్వాత ఆ గ్రామంలో మరల ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి షి టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ను నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రంలో ఒక కాలేజీలో చదువుతున్న విద్యార్థిని తను రోజు కాలేజీకి వెళ్లి వచ్చే క్రమంలో పరిచయమైన ఆటో డ్రైవర్ తనను ట్రాప్ చేయగా అట్టి వ్యక్తిపై షి టీం కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది.జిల్లాలోని ఒక మండలంలో ఒక వివాహిత మహిళ యొక్క ఫోటోలను వారి బంధువు ఒకతను మార్ఫింగ్ చేసి తన కుటుంబ సభ్యులకు పంపి ఇబ్బంది పెట్టగా సదరు వ్యక్తిని గుర్తించి కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది.జిల్లాలో ఒక కాలేజీ విద్యార్థి ని నీ తన దూరం బంధువు అయిన ఒక వ్యక్తి వెంటపడి కాలేజీకి వచ్చి ఇబ్బంది పెట్ట గా అట్టి వ్యక్తిపై కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది.బస్టాండ్ ఏరియాలలో విద్యార్థినులను ఈవిటీజింగ్ చేస్తుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కౌన్సిలింగ్ చేయడం, కొన్ని సందర్భాల్లో కేసులు చేయించడం కూడా జరిగింది.జిల్లా కేంద్రంలోని కొన్ని ఏరియాలలో, సినిమా థియేటర్ పరిసర ప్రాంతాలలో ఉండే యువత చెడు అలవాట్లకు ముఖ్యంగా గంజాయి మత్తుకు బానిస అవుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో మైనర్లు ఈ విధంగా దొంగతనాలకు పాల్పడడం, మత్తు పదార్థాలకు బానిసవ్వడం, మహిళలపై వేధింపులకు పాల్పడటానికి వెనుకాడటం లేదు. ఇటువంటి వాటి గురించి కాలేజీలు, హాస్టల్ లు , గ్రామాలలో కూడా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

తాజావార్తలు