హైదరాబాద్,సెప్టెంబర్24 జనం సాక్షి : టెరిటోరియల్ ఆర్మీలో సైనికులు, క్లర్క్, చెఫ్ కమ్యూనిటీ, చెఫ్ స్పెషల్, హెయిర్‌డ్రెస్సర్ పోస్టులకు అక్టోబర్ 15 నుంచి 25 వరకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. తెలంగాణ, ఏపీ, గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గోవా, కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రానగర్‌హవేలి, డామన్ డయ్యూ, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్టాల్ల్రోని అభ్యర్థులకు ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో నిర్వహించే ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనాలనుకునేవారు ఆన్‌లైన్‌లో రిజిస్టేష్రన్ చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు అక్టోబర్ 7 వరకు గడువు ఉన్నదని, 18 నుంచి 42 ఏండ్ల మధ్యవారు మాత్రమే అర్హులని తెలిపారు.




