హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచి నగరంలోని పలు చోట్ల కుండపోత వాన పడుతోంది. జూబ్లీహీల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్సార్‌ నగర్‌, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్‌, బేగంపేట, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లిలో వర్షం దంచి కొడుతోంది. మధ్యాహ్నం నుంచే దట్టమైన నల్లమబ్బులు నగరాన్ని కమ్మేశాయి. భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. కృష్ణానగర్‌, వెంగళరావుపార్క్‌లో 4.1,  మాదాపూర్‌లో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సాయంత్రం సమయం కావడంతో ఉద్యోగస్థులు ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచపోయినందున.. వాహనదారులు జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుకోవాలన్న పోలీసులు కోరుతున్నారు విధులు ముగించుకుని ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు కొంచెం ఆలస్యంగా బయల్దేరడం మంచిదని సూచించారు.