ఆక్స్‌ఫర్డ్‌లో అన్నకు చోటు
లండన్,అక్టోబర్26(జనంసాక్షి): ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ‘అన్న’ పదానికి చోటు దక్కింది. తెలుగులో, తమిళంలో సోదరుడు అని దీనికిఅర్థం. ఈ పదానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో ఈ పదానికి చోటు దక్కింది. గత నెల అప్‌డేట్ చేసిన ఈ నిఘంటువులో తాజాగా తెలుగు, ఉర్దూ, తమిళం, హిందీ, గుజరాతీ తదితర భాషలకు చెందిన 70 భారతీయ పదాలను చేర్చారు.రూపాయిలో ఆరో వంతుకు సూచికగా ఇంతకుమును ‘అణా’ ( ంనినిజీ) అనే పదం ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ఉండేది. ఇప్పుడు అదే ఆంగ్ల పదాల స్పెల్లింత్ అన్న, అన్నన్ పదాలను నిఘంటువులో చేర్చారు. ఉర్దూ పదం ‘అబ్బా’ (తండ్రి)ను నిఘంటువులో పొందుపర్చారు. అచ్చా, బాపు, బాడా దిన్, బచ్చా, సూర్య నమస్కార్ వంటి పదాలు ఈ నిఘంటువులో చోటు సంపాదించాయి.