హైదరాబాద్,జూన్23(జనం సాక్షి): జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో ఓ అగంతకుడు హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి.. అరుణోదయ ట్రస్ట్ 2వ అంతస్తులోకి పక్కనున్న బిల్డింగ్ నుంచి కిటికీల గ్రిల్స్ తొలగించి ప్రవేశించాడు. ఆ అంతస్తులో నిద్రిస్తున్న ఆడపిల్లల పట్ల అగంతకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతన్ని పట్టుకున్న అమ్మాయిలు, స్థానికులు కలిసి దేహశుద్ది చేశారు. అనంతరం అగంతకుడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




