టేకులపల్లి మండలంలో ఐఎఫ్టియు ప్రచారం
టేకులపల్లి, ఆగస్టు 23( జనం సాక్షి): కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 29న హైదరాబాదులో ఐఎఫ్టియు నిర్వహించే భారీ ప్రదర్శన,ధర్నాకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు డి. ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం టేకులపల్లి మండలం ఆంజనేయ పురంలో నిర్వహించిన తెలంగాణ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం అనంతరం చలో హైదరాబాదు ప్రచార వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా కుదించి కార్మిక హక్కులను కాలరాసిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుందని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలో కొనసాగుతూ మాటలకె పరిమితమైందని, కార్మిక సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలపై ఐ ఎఫ్ టి యు జాతీయ కమిటీ పిలుపుమేరకు ఆగస్టు 29న హైదరాబాదులో వేలాది మందితో జరిగే భారీ ప్రదర్శన,ధర్నా కార్యక్రమానికి అన్ని విభాగాల కార్మికులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి మోత్కూరి మల్లికార్జునరావు,ఐ ఎఫ్ టి యు టేకులపల్లి ఏరియా కార్యదర్శి రాయండ్ల కోటిలింగం,జిల్లా నాయకులు డి. నూనెశ్వరరావు,పల్లి సుధాకర్,రేసు అ




