ఆగస్టు 3న చలో పార్లమెంట్
-గిరిజనులకు నష్టం కలిగించే అడవి సంరక్షణ 2022 చట్టాన్ని వ్యతిరేకిద్దాం
-పార్లమెంటును ముట్టడిద్దాం టేకులపల్లి, జూలై 28( జనం సాక్షి ): ఆదివాసి గిరిజనులకు నష్టం కలిగించే అడవి సంరక్షణ 2022 చట్టాన్ని వ్యతిరేకించాలని అందుకోసం ఆగస్టు 3న చలో పార్లమెంటు కార్యక్రమాన్ని నిర్వహించి పార్లమెంటుని ముట్టడిద్దామని ఏఐకేఎంఎస్ జాతీయ కమిటీ పిలుపుమేరకు జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కమిటీ ఆధ్వర్యంలో ముత్యాలంపాడు గ్రామంలోని దుబ్బ తండ ఏరియాలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించినారు.జోగా నాగరాజు అధ్యక్షతన గురువారం జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల కార్యదర్శి కల్తీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏ ఐ కె ఎమ్ ఎస్ జాతీయ కమిటీ పిలుపుమేరకు, మండల వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ అటవీ సంరక్షణ చట్టం 2022 బిల్లుకు వ్యతిరేకంగా నిరసనను తెలియజేస్తూ, ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అత్యున్నతపీఠం భారతదేశ రాష్ట్రపతి గా ఆదివాసి మహిళ ద్రౌపతి ముర్మ ను ఎన్నుకోవడం జరిగింది. కానీ, దేశంలోని గిరిజన ఆదివాసీ మహిళల పై పోడు భూముల పేరుతో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు పంట చేలను ధ్వంసం చేస్తూ, హరితహారం పేరుతో, ఆదివాసి మహిళ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే తెలంగాణ ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండల పరిధి, ఆళ్లపల్లి మండల పరిధి సరిహద్దులో రాయపాడు అనే గిరిజన కుగ్రామం పై పోడు సాగు దారులైన ఆదివాసీ మహిళల పై ఫారెస్ట్ అధికారులు ఎనిమిది డోజర్ ట్రాక్టర్లతో పత్తి ,మొక్కజొన్న పంటలను పైశాచికంగా ధ్వంసం చేశారు.అంతే కాకుండా ఫారెస్టు లో పనిచేసే కార్మికుల తో ఆర్మీ యూనిఫాం వేయించి దుర్మార్గంగా ఆదివాసి మహిళలను బెదిరించి,పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారు.అటవీ సంరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం బిల్లులు తెస్తూ,అడవి ప్రాంతాలలో గల నిక్షేపాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు,ఆ విశ్రాంతి గా పార్లమెంట్లో యద్ధం చేస్తున్నది.5వ షెడ్యూల్ ప్రాంతంలో గల ఆదివాసి హక్కులకు భంగం కలిగిస్తూ,ఖనిజ నిక్షేపాలను,ఖనిజ సంపదను, పార్లమెంటులో బిల్లు ద్వారా తీసుకవచ్చి ,అడవిబిడ్డలైన అధివాసీలను, గిరిజనులను, అడవి నుండి , వెల్లగొట్టేందుకు,అనగదొక్కేందు Attachments area
|