ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకలు* 563 సినిమా థియేటర్లలో పిల్లలకు గాంధీ చిత్ర ప్రదర్శన* వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ నల్గొండ బ్యూరో. జనం సాక్షి జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై శనివారం డీజిపీ మహెందర్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.సి.ఎస్. మాట్లాడుతూ, భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకల షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 563 సినిమా థియేటర్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉదయం 10 గంటలకు గాంధీ చిత్ర ప్రదర్శన జరుగుతుందని, 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థి(ప్రభుత్వ & ప్రైవేట్) సినిమా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ఆగస్టు 8 న నిర్వహించే ప్రారంభం కార్యక్రమానికి జిల్లా నుంచి జడ్పీటీసీ, ఎంపీపీ లు, రైతు బంధు సమితి నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్ లు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సినిమా థియేటర్ గాంధీ సినిమా సాటిలైట్ లింక్ రేపటి వరకు డౌన్ లోడ్ చేసుకోవాలని, దీనిని తహసిల్దార్, ఎస్.హెచ్.ఒ ధృవీకరించాలని మున్సిపల్ ,పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. ఆగస్టు 12 న ప్రతి సిటీ కేబుల్ ఛానల్ లో దేశ భక్తి పెంపోందించే కార్యక్రమాలు టెలికాస్ట్ చేయాలని, వీటీకి సంబంధించిన లింక్ లను డిపిఆర్వోల ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, సూర్యా పేట,యాదాద్రి భువన గిరి జిల్లా ల అదనపు కలెక్టర్ లు పాల్గొన్నారు
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 08 : పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్‌టీ విధించడం దుర్మార్గమైన చర్య అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచం అగ్రగామిగా ఉందన్నారు. 2017 జూలై వరకూ పాలు, వాటి ఉత్పత్తులపై పన్నులు లేవని, ఆ తర్వాత పాలు పెరుగు, మజ్జిగలను మినహాయించి మిగిలిన వాటిపై 5 శాతం పనులు వేశారని గుర్తు చేశారు. జూన్ 28, 29 తేదీల్లో జరిగిన 47వ జీఎస్టీ సమావేశంలో పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్లపై 5 నుండి 12 శాతం, డెయిరీల్లో వినియోగించే యంత్రాలపై 12 నుండి 18 శాతం జీఎస్టీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు. పాడి పరిశ్రమలపై ఆధారపడిన సూక్ష్మ చిన్న, మధ్య, తరహా పరిశ్రమలను కార్పొరేట్లకు అప్పగించటానికే పాల పరిశ్రమపై కేంద్రం పన్నుల భారాన్ని మోపిందని విమర్శించారు. రైతులకు, ప్రభుత్వ డెయిరీలకు, వినియోగదారులకూ ఈ విధానాలను తీవ్ర నష్టమన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు దానిపై ఆధారపడిన అన్ని వస్తువుల ధరలు సహజంగా పెరుగుతాయని, ఇది చాలదన్నట్టు పాడి రైతులను, వినియోగదారులను దెబ్బతీసేలా పన్నులు పెంచటం అన్యాయమని మండిపడ్డారు. ఈ విధానం వల్ల సూక్ష్మ ,చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడతాయని, వినియోగం తగ్గి, మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం మరింత పెరుగుతుందని వివరించారు. పన్నుల పెంపు, పాల ఉత్పత్తుల దిగుమతుల వల్ల ప్రభుత్వ డెయిరీలు, మూతపడి, ప్రైవేటు డెయిరీలు రంగంలోకి వస్తాయని, ఫలితంగా పాల కల్తీ మరింత పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. పౌష్టికాహారంగా ఉపయోగించే పాలు, వాటి ఉత్పత్తులపై జీఎస్‌టీ దారుణమన్నారు. కేరళ తరహాలో పాడి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈసమావేశంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల సహాయ కార్యదర్శి బండారి సిద్ధులు, గుడెపు సుదర్శన్, పల్లెమేని రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.