జాతీయ సమైక్యత పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ::సీఎస్ సోమేశ్ కుమార్
ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకలు*
563 సినిమా థియేటర్లలో పిల్లలకు గాంధీ చిత్ర ప్రదర్శన*
వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై శనివారం డీజిపీ మహెందర్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.సి.ఎస్. మాట్లాడుతూ, భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకల షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 563 సినిమా థియేటర్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉదయం 10 గంటలకు గాంధీ చిత్ర ప్రదర్శన జరుగుతుందని, 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థి(ప్రభుత్వ & ప్రైవేట్) సినిమా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ఆగస్టు 8 న నిర్వహించే ప్రారంభం కార్యక్రమానికి జిల్లా నుంచి జడ్పీటీసీ, ఎంపీపీ లు, రైతు బంధు సమితి నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్ లు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సినిమా థియేటర్ గాంధీ సినిమా సాటిలైట్ లింక్ రేపటి వరకు డౌన్ లోడ్ చేసుకోవాలని, దీనిని తహసిల్దార్, ఎస్.హెచ్.ఒ ధృవీకరించాలని మున్సిపల్ ,పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. ఆగస్టు 12 న ప్రతి సిటీ కేబుల్ ఛానల్ లో దేశ భక్తి పెంపోందించే కార్యక్రమాలు టెలికాస్ట్ చేయాలని, వీటీకి సంబంధించిన లింక్ లను డిపిఆర్వోల ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, సూర్యా పేట,యాదాద్రి భువన గిరి జిల్లా ల అదనపు కలెక్టర్ లు పాల్గొన్నారు