ఆగస్ట్‌12న మాచర్ల నియోజకవర్గం

నటుడు నితిన్‌ ’రంగ్‌దే’ విజయం సాధించగా ’చెక్‌’ ప్లాప్‌గా మిగిలింది. ఇక ’మ్యాస్టోన్రేరుగా ఓటీటీలో విడుదలై మంచి వ్యూవర్‌ షిప్‌ను సాధించింది. ప్రస్తుతం నితిన్‌ నటిస్టున్న లేటెస్ట్‌ చిత్రం ’మాచర్ల నియోజకవర్గం’. రొటీన్‌కు భిన్నంగా నితిన్‌ ఈ సారి పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథతో రానున్నాడు. ప్రముఖ ఎడిటర్‌ ఎంఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ అప్‌డేట్‌లను షురూ చేసారు. తాజాగా ఈ చిత్రంలోని ’రా రా రెడ్డి’ సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. ’రా రా రెడ్డి’ అంటూ సాగే ప్రోమో ఆకట్టుకుంటుంది. నితిన్‌, అంజలి మాస్‌ బీట్‌ స్టెప్స్‌ అలరిస్తున్నాయి. మహతి స్వర సాగర్‌ ట్యూన్‌ ఊపునిస్తుంది. ఈ మాస్‌ సాంగ్‌, జాతరలో జరిగే ఫైట్‌ ముందు వచ్చే పాటలా కనిపిస్తుంది. ఫుల్‌ సాంగ్‌ శనివారం సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. నితిన్‌ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నటించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్‌ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో నితిన్‌ మొదటి సారిగా పూర్తి యాక్షన్‌ సినిమాలో నటించనున్నాడు.