Tuesday, 3 November 2026

మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గున్న సంధ్య

సికింద్రాబాద్ న్యూ బోయిన పల్లి అక్టోబర్ 20 జనం సాక్షి జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరా రాజీవ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గున్న సంధ్య తన 100 మంది అనుచరులతో కలిసి మంత్రి చామకూర మల్ల రెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో చేరారు. తాను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకిర్షితురాలై మంత్రి మల్లారెడ్డి నాయకత్వంలో జవహర్ నగర్ అభివృద్ధి లో భాగస్వామిని కావాలని నేను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో చేరుతున్నట్లు గున్నసంధ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య , డిప్యూటీ మేయర్ ఆర్ ఎస్ శ్రీనివాస్, జవహర్ నగర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్, కార్పొరేటర్లు,జవహర్ నగర్ మాజీ ఎంపీటీసీ రషీదా బేగం, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.