*ఆటో కార్మికులు
( జనం సాక్షి ) జూలై 16 :- రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కార్మికుల పక్షపాతిగా పనిచేస్తున్నారని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం అధ్యక్షులు వేముల మారయ్య లు అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 714 జీవోను రద్దు చేసిన శుభ సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆటో యూనియన్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ కావ్య డిప్యూటీ మేయర్ రెడ్డి శ్రీనివాస్ గుప్తా తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు వేముల మారయ్యలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 770 కోట్ల రోడ్ టాక్స్ లు మాఫీ చేసి ఆటో కార్మికులకు అండగా నిలిచిన ఘనత టిఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని అన్నారు ఆటో డ్రైవర్లు ప్రమాదవశాత్తు మృతి చెందిన యెడల ఆటో కార్మికులు ఐదు పది చెంద వేసుకొని దహన కార్యక్రమాలు చేసుకునే దుస్థితినీ రూపుమాపాలని ఐదు లక్షల ప్రమాద బీమా వసతి కల్పించి ఆటో కార్మికులకు అండగా నిలిచిన ఘనత కూడా టిఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని వివరించారు ఆటో కార్మికులకు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా అండదండగా ఉంటూ మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆటో కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ ఆటో యూనియన్ అధ్యక్షులు బోయిని నాగేష్ కందుల స్వామి టీ రాములు పి రాజయ్య బి గాలయ్య జి కృష్ణ పి రమేష్ ఎం శేషు ఎం సాయి శ్రీను పి నాగేష్ కె శ్రీనివాస్ రెడ్డి జి నరసింహ ఎల్ నరసింహ కె అనిల్ ఎస్ సురేష్ లతోపాటు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు




