ఆటో డ్రైవర్ కు చేయూత
ఆనతి కాలంలోనే మన్ననలు పొందుతున్న జీ.ఎస్.ఆర్.ఫౌండేషన్
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణం లోని ఆటో డ్రైవర్ రాజు అనారోగ్యం కారణంగా, ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయి, వైద్యం కోసం హైదరాబాద్ కి వెళ్లాడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఆటో యూనియన్ వారు జి ఎస్ ఆర్ ఫౌండేషన్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే డాక్టర్ రాజ రమేష్, అతని మిత్రబృందం స్పందించారు. వెంటనే వారి ఇంటికి వెళ్ళి పరిస్థితి చూసి మంగళవారం ఉదయం డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం వాళ్ళ ఇంటికి వెళ్లి దారి ఖర్చుల నిమిత్తం ఐదువేల రూపాయలు ఇచ్చి గాంధీ జనరల్ హాస్పిటల్ కి పంపించారు.
అనంతరం అక్కడ డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందిస్తానని డాక్టర్ రాజ రమేష్ బాబు తెలిపారు. ఆటో డ్రైవర్స్ సోదరులు అందరూ మద్యం, పొగాకు, గుట్కాలకు దూరంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మేకల రాజయ్య, బద్రి సతీష్, కిరణ్, ప్రకాష్, సురేష్ ,ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఏనగంటి సంపత్ కుమార్, పాక అంజయ్య, శ్రీధర్, మల్లేష్, శంకర్, సుల్తాన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.